ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం ఉదయం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వీరి భేటీ జరిగింది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం ఉదయం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. కాగా సమావేశానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా సనత్ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన తలసాని కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన త్వరలో టీఆర్ఎస్లో చేరతారనే కథనాలు వెలువడ్డాయి. అయితే తలసాని మాత్రం పార్టీ మారుతున్నట్లు ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. తలసాని గతంలోనూ కేసీఆర్ను కలిసి మంతనాలు జరిపిన విషయం తెలిసిందే.