పేదలకు అండగా స్వేరోస్‌ | Sveros support the poor | Sakshi
Sakshi News home page

పేదలకు అండగా స్వేరోస్‌

Mar 13 2017 4:21 PM | Updated on Sep 5 2017 5:59 AM

నిరుపేదలకు అండగా స్వేరోస్‌ వెంట ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అ«ధ్యక్షుడు రాజన్న అన్నారు.

దుగ్గొండి (నర్సంపేట) : నిరుపేదలకు అండగా స్వేరోస్‌ వెంట ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అ«ధ్యక్షుడు రాజన్న అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్యాంకుమార్‌ అధ్యక్షతన స్వేరోస్‌ భీం దీక్షా శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నిరుపేద మామునూరి మల్లయ్య ఇంటి నిర్మాణాన్ని సంస్థ విరాళాలతో రాజన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులను ఒక్కటిగా చేసే స్వేరోస్‌ సంస్థ ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల్లో పేద విద్యార్థులు, పేద కుటుంబాలకు తోచిన సాహాయాన్ని దాతల సహకారంతో అందిస్తామని తెలిపారు.  నిరుపేద ఇంటి నిర్మాణానికి చేయూతనందించిన శ్యాంకుమార్‌ను అభినందించారు. గ్రామాల్లో దళిత నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికసాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమా ర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి స్వేరో పనిచేసి మంచి ఫలితాలు సాధించా లని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాదారపు రవి, శ్యామలపట్టాభి, చక్రి, శివ, శ్యాం, లెనిన్, ప్రవీణ్, భరత్, ప్రసాద్, యాకూబ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement