గుంటూరులో ఉద్రిక్తత.. పేదల ఇళ్లు కూల్చివేత | Demolition Of Poor People Houses In Motilal Nagar, Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో ఉద్రిక్తత.. పేదల ఇళ్లు కూల్చివేత

Apr 21 2026 10:12 AM | Updated on Apr 21 2026 12:01 PM

Demolition Of Poor People Houses In Motilal Nagar, Guntur

సాక్షి, గుంటూరు: మోతీలాల్ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు.. పేదల ఇళ్లు తొలగిస్తున్నారు. వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి పేదల ఇళ్లను అధికారులు తొలగిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలా ఇల్లు తొలగిస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్తే నీచంగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కిందపడి చావండంటూ సలహా ఇచ్చారని బాధితులు మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌పై బాధితులు దుమ్మెత్తి పోస్తున్నారు. మోతిలాల్ నగర్‌లో పర్యటించిన వైఎస్సార్‌సీపీ నేత నూరి ఫాతిమా బాధితులను పరామర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ఇల్లు తొలగించాలని నూరి ఫాతిమా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement