విష జ్వరాలపై అధ్యయనం

A study on toxic fevers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ప్రబలుతున్న విష జ్వరాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకు హార్వర్డ్‌ యూనివర్సిటీలో సౌత్‌ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహిస్తున్న లక్ష్మీ మిట్టల్‌ గ్రూపు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు విష జ్వరాలపై అధ్యయన ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించేందుకు హామీ ఇచ్చింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన హార్వర్డ్‌ వర్సిటీలోని సౌత్‌ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌ బీ4 ప్రోగ్రాం మేనేజర్‌ సవితా జి అనంత్‌కు గిరిజనులకు ప్రబలే విషజ్వరాలపై ఉన్నత విద్యా మండలి ఓ నివేదికను అందజేసింది. వాటిపై పరిశోధన చేసేందుకు సహకారం అందించాలని కోరగా, దానికి ఆమె సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

రాష్ట్రంలో ఉన్నత విద్యలో పరిశోధనలను పెంచేందుకు చర్యలు చేపడుతున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు విదేశీ వర్సిటీలు, సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. అందులో భాగంగానే హార్వర్డ్‌ వర్సిటీకి వెళ్లిన మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్లు ఆర్‌.లింబాద్రి, వెంకటరమణ లక్ష్మీ మిట్టల్‌ గ్రూపు నిర్వíßస్తున్న సౌత్‌ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. అలాగే తలసేమియా వ్యాధికి సంబంధించిన పరిశోధనలకు కూడా సహకరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. డిసెంబర్‌లో ఆ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top