భీమవరంలో భయం భయం | Student killed by diarrhea | Sakshi
Sakshi News home page

భీమవరంలో భయం భయం

Nov 20 2014 3:04 AM | Updated on Sep 2 2017 4:45 PM

భీమవరంలో అతిసారం విజృంభించింది. ఇప్పటికే ఓ విద్యార్థి మృతిచెందాడు.

  భీమవరం (కూనవరం): భీమవరంలో అతిసారం విజృంభించింది. ఇప్పటికే ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో 20మంది అస్వస్థులయ్యూరు. దీంతో, ఈ గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. ఈ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి మునిగెల మధు(22) మూడు రోజుల కిందట అతిసారంతో అస్వస్థుడయ్యూడు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందినప్పటకీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్పించారు. హైదరాబాద్ తీసుకెళ్లాలని అక్కడి వైద్యుడు సూచించారు.

చేతిలో తగినంత డబ్బు లేకపోవడంతో మధును అతని కుటుంబీకులు మంగళవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి వేళ తీవ్రమైన వాంతులతో అతడు మృతిచెందాడు. మధు నివాసముంటున్న వీధికే చెందిన గంధ ం నాగమ్మ, గంధం అలివేలు, ముదుగొండ విజయ్‌కుమార్, ముదుగొండ రమాదేవి, ముదుగొండ రమ్య, నక్క వెంకటరమణ, బట్టా రాములమ్మ, నోముల సీతారామమ్మ, మందా అలివేలి మంగ, నోముల అలివేలు, నోముల సాయికృష్ణ, నోముల దేవి, గంధం సత్యనారాయణ, నందికొండ రాంబాబు, నందికొండ రాధిక, మునిగెల పుష్పావతి, బట్టా ప్రవీణ్, బట్టా శ్రీదేవి, శైలజ కూడా వాంతులు, విరేచనాలతో అస్వస్థులయ్యూరు. వీరంతా స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బట్టా నవీన్‌ను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

 వైద్య శిబిరం ఏర్పాటు
 అతిసారం సోకిన వీధిలో వైద్య శిబిరాన్ని కూనవరం వైద్యాధికారి డాక్టర్ అమరేంద్ర ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి దాదాపు 40మందిని వైద్య సిబ్బంది పరీక్షించారు. జ్వరంతో బాధపడుతున్న ఏడుగురి నుంచి రక్త నమూనాలు సేకరించారు.  ఆహారం విషతుల్యం కారణంగానే అతిసారం ప్రబలినట్టుగా భావిస్తున్నట్టు వైద్యాధికారి డాక్టర్ అమరేంద్ర చెప్పారు. ఈ గ్రామాన్ని ఎంపీడీఓ అన్నపూర్ణ సందర్శించారు. పారిశుధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement