భవనం పైనుండి పడి విద్యార్థిని మృతి | Student dies in freak accident | Sakshi
Sakshi News home page

భవనం పైనుండి పడి విద్యార్థిని మృతి

Jul 3 2016 5:48 PM | Updated on Nov 9 2018 4:36 PM

నిర్మాణంలో ఉన్న ఇంటి రెయిలింగ్‌కు నీళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుండి కింద పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

నేరేడ్‌మెట్ (హైదరాబాద్) : నిర్మాణంలో ఉన్న ఇంటి రెయిలింగ్‌కు నీళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుండి కింద పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రగిరి కాలనీలో నివాసముండే వెంకటేశ్వర రెడ్డి ఆయన ఉన్న ఇంటిపైన రెండవ అంతస్తులో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు.

కాగా డిగ్రీ చదువుకునే వెంకటేశ్వరరెడ్డి కుమార్తె కుమారి నవ్యశ్రీ (19) ఆదివారం రెండవ అంతస్తులో నిర్మాణం చేస్తున్న రెయిలింగ్‌కు నీళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు రెయిలింగ్‌తోపాటు నవ్యశ్రీ కింద పడిపోయి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్నత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement