ఖోఖో ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి | student died over play koko game | Sakshi
Sakshi News home page

ఖోఖో ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి

Jan 23 2016 12:42 PM | Updated on Nov 9 2018 4:36 PM

ఖోఖో ఆడుతున్న ఏడవ తరగతి విద్యార్థి కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.

జూలూరుపాడ: ఖోఖో ఆడుతున్న ఏడవ తరగతి విద్యార్థి కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని సాధన స్కూల్లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రుగొండ మండలానికి చెందిన భూక్యా భద్రాచలం (13) సాధన స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలలో ఖోఖో ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది భద్రాచలంను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దీంతో పాఠశాలలో విషాద వాతావరణం నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement