ఆవేదన నుంచి పుట్టిన ఆవిష్కరణ | student create new siaran motion for selain bottle | Sakshi
Sakshi News home page

ఆవేదన నుంచి పుట్టిన ఆవిష్కరణ

Nov 12 2016 3:26 AM | Updated on Nov 9 2018 5:02 PM

ఆవేదన నుంచి పుట్టిన ఆవిష్కరణ - Sakshi

ఆవేదన నుంచి పుట్టిన ఆవిష్కరణ

ఓ విద్యార్థి.. మరో ఉపాధ్యాయురాలి ఆవేదన నూతన ఆవిష్కరణకు శ్రీకారం చూట్టింది.

సెలైన్ అరుుపోగానే సైరన్
జాతీయ ఇన్‌స్పైర్‌కు ఎంపిక
విద్యార్థి, ఉపాధ్యాయురాలి మేధోశ్రమకు ప్రశంసలు

 గోవిందరావుపేట: ఓ విద్యార్థి.. మరో ఉపాధ్యాయురాలి ఆవేదన   నూతన ఆవిష్కరణకు శ్రీకారం చూట్టింది. రోగికి సెలైన్ ఎక్కించే సమయంలో అది ఎప్పుడు అరుుపో తుందోనని ఎదురు చూడకుండా.. సైరన్ మోగేలా చేసిన వీరి ఆవిష్కరణ జాతీయస్థారుు ఇన్‌స్పైర్‌కు ఎంపికైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండ లం పస్రా గ్రామానికి చెందిన బొజ్జ ప్రభు లత(14) గోవిందరావుపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. తల్లి అనారోగ్యం బారిన పడిన సమ యంలో సెలైన్ ఎక్కించినప్పుడు అది ఎప్పుడు అరుుపోతుందా అని ఎదురు చూసేది. ఇదే పరిస్థితిని పాఠశాల ఉపాధ్యాయురాలు కొము ర పాలెం జ్యోతి తన సోదరుడి అనారోగ్యం సందర్భంగా ఎదుర్కొంది. ఇరువురూ సెలైన్ అరుుపోగానే సిగ్నల్ వచ్చేలా చేస్తే బాగుం టుందని ఆలోచించి, ఈ మేరకు అలాంటి పరికరం ఆవిష్కరణకు పూనుకున్నారు.

పలువురి ప్రశంసలు
వీరి ప్రదర్శనను తిలకించిన ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్ సురేష్‌బాబు, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రతినిధి రజని, డీఆర్‌డీవో శాస్త్రవేత్త కరుణానిధి, పలువురు ఉస్మానియా ప్రొఫెసర్లు నూతన ఆవిష్కరణను అభినందించారు. జిల్లా ఇన్‌స్‌పైర్‌లో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్ , ఎన్‌ఐటీ వరంగల్‌లో నిర్వహించిన టెక్నోజి యాన్, హైదరాబాద్‌లో  ఎగ్జిబిట్‌ను ప్రదర్శిం చి అన్ని చోట్లా పలువురి ప్రశంసలు పొందారు. తాజాగా జాతీయ ఇన్‌స్పైర్ పోటీలలో డిసెంబర్ 10, 11 తేదీల్లో ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

 జాతీయ స్థారుుకి వెళతాననుకోలేదు..
తమ ఉపాధ్యాయురాలితో కలిసి తయారు చేసిన ఎగ్జిబిట్ జాతీయ స్థారుుకి వెళుతుందని ఊహించలేదని ప్రభులత పేర్కొంది. రోగులకు సేవలందించే క్రమంలో వారి బంధు వులు, నర్సింగ్ స్టాఫ్‌కు ఉపయోగకరంగా ఉండేలా మంచి ఆలోచనకు సహకరించడం ఎంతో సంతృప్తినిస్తోందని జ్యోతి ఆనందం వ్యక్తం చేసింది.

ఎలా పనిచేస్తుందంటే..
డ్రిప్ మానిటర్‌ను చిన్న తూకం వేసే స్ప్రింగ్, 9 ఓల్టుల బ్యాటరీ, బజర్, ఎల్‌ఈడీ, స్విచ్, స్టాండ్, సెలైన్ వంటి పరికరాలతో రూ.300లోపు ఖర్చుతో తయారు చేశారు. స్ప్రింగ్ పరికరానికి అమర్చిన వైర్ల ద్వారా బ్యాటరీ, బజర్‌కు అనుసంధానం చేశారు. స్ప్రింగ్‌కు సెలైన్‌ను పెట్టడం ద్వారా బాటిల్‌లో ద్రవం తగ్గిన కొద్దీ స్ప్రింగ్ దగ్గరకు వచ్చి 50 ఎంఎల్ ఉండగానే బజర్ మోగు తుంది. దీనిని ఆస్పత్రిలో పేషెంట్ వద్ద కాకుండా వైర్ అమర్చి దూరంగా నర్స్ లుండే ప్రాంతంలో ఉంచేలా ఆధునీ క రించి రాష్ట్రస్థారుు ప్రదర్శనలో ఉం చారు.  బజర్ మోగగానే నర్సులు ఆ బెడ్ వద్దకు వెళ్లి సేవలందించే వీలు కలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement