సైకిల్‌ కొనివ్వలేదని విద్యార్థి సూసైడ్‌ | student committed to suicide for cycle | Sakshi
Sakshi News home page

సైకిల్‌ కొనివ్వలేదని విద్యార్థి సూసైడ్‌

Sep 11 2017 10:15 AM | Updated on Nov 9 2018 5:02 PM

చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

సాక్షి, ఖమ్మం: చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంట్లో సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఒకరు, కొత్త బట్టలు కుట్టించలేదని మరొకరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా సైకిల్‌ కోసం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలకు వెళ్లడానికి సైకిల్‌ కొనివ్వమని ఎంత పోరు పెట్టినా.. తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ సంఘటన జిల్లాలోని ఎర్రుపాలెం మండలం నారాయణపురంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌(13)  స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా బడికి వెళ్లడానికి సైకిల్‌ కొనివ్వమని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. అయితే అరుణ్‌ అడిగిన విషయాన్ని వారు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement