
ప్రధానాకర్షణగా స్టీఫెన్‌సన్
ఓటుకు నోటు వివాదంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ సోమవారం ఎమ్మెల్సీ
ఎదురుపడ్డా పలకరించుకోని రేవంత్, స్టీఫెన్
హైదరాబాద్: ఓటుకు నోటు వివాదంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అసెంబ్లీలో ఆద్యంతం ప్రధానాకర్షణగా నిలిచారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా తనను ప్రలోభపెట్టజూసిన ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని స్టీఫెన్‌సన్ ఏసీబీకి రెడ్‌హాండెండ్‌గా పట్టించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అసెంబ్లీకి వచ్చిన స్టీఫెన్‌సన్‌ను మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అభినందించారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుని బయటకు వస్తున్న సయమంలోనే రేవంత్ కూడా ఓటేసేందుకు వచ్చారు. వారిద్దరూ పరస్పరం ఎదురుపడ్డా చూసుకోకుండా వెళ్లిపోయారు.