తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు కొత్త ఐపీఎస్‌లు | Six new IPSs allocated for Telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు కొత్త ఐపీఎస్‌లు

Apr 27 2015 3:48 AM | Updated on Sep 3 2017 12:56 AM

తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు కొత్త ఐపీఎస్‌లు

తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు కొత్త ఐపీఎస్‌లు

తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది.

సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. వీరిని ఉమ్మడి క్యాడర్‌గా పేర్కొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు ఈ అధికారుల్ని పంచుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకుకేటాయించిన వారిలో జార్ఖండ్‌కు చెందిన ఎం.దీపిక, కర్ణాటకకు చెందిన బీకే రాహుల్ హెడ్గే, ఉత్తరాఖండ్‌కు చెందిన సునీల్ దత్, రాజస్థాన్‌కు చెందిన అమిత్ బర్ధార్‌లతో పాటు స్థానికులైన బి.కృష్ణారావు, కె.అపూర్వరావులు ఉన్నారు. 2013 బ్యాచ్‌లో ఐపీఎస్‌కు ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 11 మందిని హోం శాఖ వివిధ రాష్ట్రాలకు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement