నా షాపు ముందే కూర్చుంటావా అని.. | Sitting in front of the shop owner attack with scissor | Sakshi
Sakshi News home page

నా షాపు ముందే కూర్చుంటావా అని..

Jun 4 2016 10:00 PM | Updated on Sep 4 2017 1:40 AM

టైలర్ షాపు ముందు కూర్చున్న ఓ వ్యక్తి పై షాపు యజమాని కత్తెరతో దాడి చేసిన సంఘటన నగరంలోని ఎల్బీ నగర్ ఎన్.టి.ఆర్ నగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

హైదరాబాద్: టైలర్ షాపు ముందు కూర్చున్న ఓ వ్యక్తి పై షాపు యజమాని కత్తెరతో దాడి చేసిన సంఘటన నగరంలోని ఎల్బీ నగర్ ఎన్.టి.ఆర్ నగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రాజు అనే వ్యక్తి టైలర్ షాపు ముందు కూర్చున్న సమయంలో షాపు యజమాని కత్తెరతో పొడిచాడు.
 
దీంతో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement