ఆర్టీసీ సమ్మెకు సింగరేణి కార్మికుల మద్దతు

Singareni Labours Union Supports To RTC Strikes In Adilabad - Sakshi

సాక్షి, మందమర్రిరూరల్‌(చెన్నూర్‌) : డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సింగరేణి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. జేఏసీ నాయకులు శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి కార్మికులను అణచివేస్తు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల్లో ఐక్యతను దెబ్బతీసే విధంగా సింగరేణి మెకానిక్‌ కార్మికులను ఆర్టీసీలో విధుల నిర్వహణ కోసం పురమాయించడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు వెంకన్న, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాద్యక్షుడు సమ్మయ్య, సీఐటీ యూ నాయకులు వెంకటస్వామి, హెచ్‌ఎంఎస్‌ నాయకులు సుదర్శన్, ఐఎఫ్‌టీయూ నాయకులు జాఫర్,  టీఎస్‌యూఎస్‌ నాయకులు రాజిరె డ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top