ఎస్ఐ సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తి | SI Siddayya funeral completed | Sakshi
Sakshi News home page

ఎస్ఐ సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తి

Apr 8 2015 3:21 PM | Updated on Sep 2 2018 5:06 PM

ఎస్ఐ సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తి - Sakshi

ఎస్ఐ సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తి

ఉగ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఎస్ఐ సిద్ధయ్య అంత్యక్రియలు ముగిశాయి.

మహబూబ్నగర్: ఉగ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఎస్ఐ సిద్ధయ్య అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో సిద్ధయ్యకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

సిద్ధయ్య అంతిమ యాత్రలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు, పోలీసులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 'సిద్ధయ్య అమర్ రహే.. ఉగ్రవాదం నశించాలి' అంటూ ప్రజలు నినాదాలు చేశారు.  అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, జైపాల్రెడ్డిలతోపాటు పలువురు ప్రముఖులు సిద్ధయ్య భౌతికకాయాన్ని సందర్శించి  నివాళులర్పించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement