ఆమె కూడా చనిపోయింది.. | She also died .. | Sakshi
Sakshi News home page

ఆమె కూడా చనిపోయింది..

Nov 12 2015 6:43 PM | Updated on Nov 6 2018 7:56 PM

మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో తన ఇద్దరు పిల్లల గొంతుకోసిన అనంతరం ఆత్మహత్యకు యత్నించిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో తన ఇద్దరు పిల్లల గొంతుకోసిన అనంతరం ఆత్మహత్యకు యత్నించిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన శ్రీమతమ్మ(27) ఈనెల 6వ తేదీ రాత్రిఇంట్లోనే తన ఇద్దరు పిల్లల గొంతు కోసి చంపేసింది.

అనంతరం గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం అర్థరాత్రి ఆమె ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచింది.


 

Advertisement
 
Advertisement
Advertisement