మైనారిటీలకు పెద్దపీట.. గంప గోవర్ధన్‌

Shabbir Ali Said I Will Develop Minority People - Sakshi

సాక్షి, కామారెడ్డి టౌన్‌: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని హసన్‌ ఫంక్షన్‌హాల్‌లో ఎంఐఎం కార్యకర్తలు, ముస్లీం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. షాదీముబారక్‌తో పేద ముస్లీం ఆడపిల్లల వివాహానికి ఆర్థికంగా ఆదుకున్నామని గుర్తు చేశారు. ముస్లీం రిజర్వేషన్ల కోసం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరిసుష్మ, వైస్‌చైర్మన్‌ మసూద్‌అలీ, నాయకులు కాళ్లగణేష్, జూకంటి ప్రభాకర్, పిప్పిరి వెంకటి ఉన్నారు.

పాతపట్టణంలో గంప గోవర్ధన్‌ ప్రచారం

సాక్షి, కామారెడ్డి అర్బన్‌: పాత పట్టణంలో గురువారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ తన ఎన్నికల ప్రచారం చేశారు. రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారానికి జిల్లా ముదిరాజ్‌ ఐక్యవేదిక అధ్యక్షుడు పున్న రాజేశ్వర్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని అభినందనలు తెలిపారు. నాయకులు రావుల గంగాధర్, ప్రభాకర్‌ యాదవ్, చందు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీలో భారీగా చేరికలు

సాక్షి, కామారెడ్డి రూరల్‌: మండలంలోని లింగాపూర్‌కు చెందిన కింది వాడకట్టు మున్నూరుకాపు రైతులు 30 మంది మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. చేరిన వారిలో చెరోల్ల కాశయ్య, లింగం, బొందయ్య, సంగయ్య, నారాయణ, బాలయ్య, ప్రవీన్, సంగయ్య, నర్సింలు, రాజయ్య చేరారు. టీఆర్‌ఎస్‌ నాయకులు షానూర్, బండారి నర్సారెడ్డి, నీరడి బాల్‌రాజు, తోట సంగమేశ్వర్, రాంరెడ్డి యూత్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, భాగయ్య ఉన్నారు. మండలంలోని అడ్లూర్‌కు చెందిన పద్మశాలి సంఘంకు చెందిన 40 మంది గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, గోపిగౌడ్, బల్వంత్‌రావు, లద్దూరి లక్ష్మీపతియాదవ్, గోపిగౌడ్‌ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top