లైంగికంగా వేధిస్తున్నారు | Sexually harassed | Sakshi
Sakshi News home page

లైంగికంగా వేధిస్తున్నారు

Oct 17 2014 12:08 AM | Updated on Jul 23 2018 8:49 PM

లైంగికంగా వేధిస్తున్నారు - Sakshi

లైంగికంగా వేధిస్తున్నారు

మాస్టర్ మైండ్స్ కళాశాల డెరైక్టర్లు తనను లైంగిక వేధింపులతో పాటు ఈవ్ టీజింగ్ చేస్తున్నారంటూ అదే కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న లెక్చరర్ వాసవీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిద్దిపేట: మాస్టర్ మైండ్స్ కళాశాల డెరైక్టర్లు తనను లైంగిక వేధింపులతో పాటు ఈవ్ టీజింగ్ చేస్తున్నారంటూ అదే కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న లెక్చరర్ వాసవీ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కొంత కాలంగా కళాశాల డెరైక్టర్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్లారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డిలు తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని వాసవి తన భర్త తిరుపతికి తెలిపింది. దీంతో ఆయన విషయాన్ని పట్టణ ఏబీవీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు.

వారు గురువారం కళాశాలకు వెళ్లి ఇదే విషయమై డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన పలువురు ఏబీవీపీ నాయకులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు ఏబీవీపీ నాయకులపై లాఠీ ఝళిపించారు. అనంతరం వారితోపాటు కళాశాల డెరైక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement