కళాశాల కరస్పాండెంట్‌పై విద్యార్థిని బంధువుల దాడి | sexual harassment on Inter-student | Sakshi
Sakshi News home page

కళాశాల కరస్పాండెంట్‌పై విద్యార్థిని బంధువుల దాడి

Mar 22 2015 12:46 AM | Updated on Jul 23 2018 9:13 PM

హుజూర్‌నగర్ పట్టణంలోని గాయత్రీ కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డిపై శనివారం అదే కళాశాలలో

       ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు
             పాల్పడ్డాడని ఆరోపణ
     పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు, కేసు నమోదు

 హుజూర్‌నగర్ పట్టణంలోని గాయత్రీ కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డిపై శనివారం అదే కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బంధువులు దాడి చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..  చిలుకూరుకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఇందిరాసెంటర్‌లో గల గాయత్రీ  కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులుగా కళాశాల కరస్పాండెంట్ సుధాకర్‌రెడ్డి సదరు విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో విద్యార్థిని పరీక్షల సమయం కావడంతో తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా దాచిపెట్టింది.  ఈనెల 20న కరస్పాండెంట్ వికృతచేష్టలను తల్లిదండ్రులకు, బంధువులకు వివరించింది. దీంతో ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కళాశాలకు చేరుకుని అక్కడే ఉన్న సుధాకర్‌రెడ్డిపై దాడి చేశారు. కాగా సుధాకర్‌రెడ్డి వారి నుంచి తప్పించుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సుధాకర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు.  సుధాకర్‌రెడ్డిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ అఖిల్‌జామా తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement