ఎవరైనా కాస్త రిచ్‌గా కనిపిస్తే చాలు అంతే..! | Sex workers Hulchul in Panjagutta circle | Sakshi
Sakshi News home page

 సెక్స్‌ వర్కర్ల హల్‌చల్‌.. మహిళల పరేషాన్‌!

Nov 19 2017 9:12 AM | Updated on Aug 21 2018 6:00 PM

Sex workers Hulchul in Panjagutta circle - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పంజగుట్ట నుంచి ఖైరతాబాద్‌ వెళ్లే మార్గంలో నిమ్స్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో సెక్స్‌వర్కర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఎవరైనా అమాయకుడు బస్‌కోసం నిలబడితే చాలు అతని వద్దకు వెళ్లి బేరం ఆడటం, ఒప్పుకోకపోయినా, బేరం కుదరకపపోయినా దాడులకు పాల్పడడం చేస్తున్నారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా చాలామంది సిగ్గుతో, రచ్చచేసుకోవడం ఇష్టంలేక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోతున్నారు. స్థానిక మహిళలు ఇక్కడ బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు.

ఎవరిపైనైనా దాడులు జరిగాయని ఫిర్యాదు వస్తే పోలీసులు కొన్నిరోజులు హల్‌చల్‌ చేసి అరెస్టులు చేయగా కొన్నిరోజులు తిరిగి సాధారణ పరిస్థితి అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ వీరి ఆగడాలు ప్రారంభమౌతాయి. ఇక అదేప్రాంతంలో ఒక లార్జ్‌ ఉంది. అందులో ఎవరైనా అమాయకులు దిగితే చాలు వారిని బెదిరించి డబ్బులు లాక్కొవడం పరిపాటి, సదరు లార్జ్‌లో మొత్తం అసాంఘిక కార్యకలాపాలే సాగుతాయని స్థానికులు చెప్పుతున్నారు. లార్జ్‌ ఓనర్‌ను పలుమార్లు పోలీసులు అరెస్టు చేసి హెచ్చరించినప్పటికీ అతని తీరులో మార్పురాలేదు. 

రిచ్‌గా కనిపిస్తే చాలు: ఎవరైనా అమాయకుడు కొద్దిగా రిచ్‌గా కనిపిస్తే చాలు అతనివద్దకు వెళ్లి వీరే పలకరిస్తారు. ఏదైనా వాహనం ఆపితే వెళ్లి వెనకకూర్చుంటారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వాలి, లేకపోతే బూతులు తిడుతూ, అతనిపై దాడి చేస్తారు. వీరంతా ఏడు ఎనిమిది మంది గ్యాంగ్‌ ఉంటారు. ఒక్కరు గొడవకు దిగగానే అందరూ వచ్చి రచ్చరచ్చ చేస్తారు. బాధితుని జేబులో ఉన్న పర్సు ఖాళీ కావాల్సిందే, అతని మెడలో చైన్, బంగారు ఆభరణాలు ఉంటే అవీ లాక్కుటారు. గతంలో ఓ వ్యక్తిపై దాడిచేసి అతని వద్ద నగదు, బంగారం లాక్కుటే బాధితుని ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పంజగుట్ట కానిస్టేబుల్‌పై సెక్స్‌వర్కర్లు దాడికిదిగి బండరాయితో బలంగా కొట్టడంతో తలపగిలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సదరు కానిస్టేబుల్‌ను యశోదా ఆస్పత్రిలో అడ్మిట్‌చేసి చికిత్స అందించారు.    

ఓ వ్యక్తిపై బ్లేడుతో దాడి: తాజాగా గురువారం సికింద్రాబాద్‌కు చెందిన సంతోష్‌ తనకారులో పనినిమిత్తం మియాపూర్‌ వెళ్లి తిరిగి వస్తున్నాడు. నిమ్స్‌ ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌ వద్ద వాహనం ఆపి ఓ షాప్‌లోకి వెళ్లి కొనుగోలు చేసి వచ్చాడు. అతన్ని ఓ సెక్స్‌వర్కర్‌ అటకాయించింది. బేరం ఆడారు కుదరకపోవడంతో అతని కారులో వెనకసీటులో కూర్చుని ఐదువేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అతను రెండువేలు ఇచ్చి తనవద్ద లేవు అని చెప్పడంతో అతనిపై బ్లేడుతో దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన అతడు కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఇక్కడ బస్సు ఎక్కాలన్నా ఎంతో కష్టంగా ఉంటుంది. ఇక్కడ నిలబడే మహిళలను అందర్నీ అదే తరహాలో చూస్తూ కొంతమంది వెకిలిచేష్టలు చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ తంతు కొనసాగుతుంది. తాము ఎక్కడికైనా వెల్లాలంటే ఖైరతాబాద్‌కు వెళ్లి బస్సు ఎక్కుతాం. --- స్థానిక మహిళ

జాతీయ రహదారి, నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రదేశంలో ఇలాంటి కార్యకలాపాలు సాగడం బాధాకరం. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఉంది. రోడ్డుపై వెళ్లేవారితో గొడవలు అయితే. ఇక్కడ ఉన్న రెండు మూడు వ్యభిచార ముఠాలకు నిత్యం గొడవలు ఎప్పుడూ మద్యం మత్తులో ఉండి స్థానికులకు తీవ్ర ఇబ్బందుకు కలుగచేస్తున్నారు. పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి.  --- ఓ స్థానిక వ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement