panjagutta Circle
-
ఎవరైనా కాస్త రిచ్‌గా కనిపిస్తే చాలు అంతే..!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో నిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న బస్‌స్టాప్‌లో సెక్స్‌వర్కర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఎవరైనా అమాయకుడు బస్‌కోసం నిలబడితే చాలు అతని వద్దకు వెళ్లి బేరం ఆడటం, ఒప్పుకోకపోయినా, బేరం కుదరకపపోయినా దాడులకు పాల్పడడం చేస్తున్నారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా చాలామంది సిగ్గుతో, రచ్చచేసుకోవడం ఇష్టంలేక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోతున్నారు. స్థానిక మహిళలు ఇక్కడ బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ఎవరిపైనైనా దాడులు జరిగాయని ఫిర్యాదు వస్తే పోలీసులు కొన్నిరోజులు హల్చల్ చేసి అరెస్టులు చేయగా కొన్నిరోజులు తిరిగి సాధారణ పరిస్థితి అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి ఇక్కడ వీరి ఆగడాలు ప్రారంభమౌతాయి. ఇక అదేప్రాంతంలో ఒక లార్జ్ ఉంది. అందులో ఎవరైనా అమాయకులు దిగితే చాలు వారిని బెదిరించి డబ్బులు లాక్కొవడం పరిపాటి, సదరు లార్జ్‌లో మొత్తం అసాంఘిక కార్యకలాపాలే సాగుతాయని స్థానికులు చెప్పుతున్నారు. లార్జ్ ఓనర్‌ను పలుమార్లు పోలీసులు అరెస్టు చేసి హెచ్చరించినప్పటికీ అతని తీరులో మార్పురాలేదు. రిచ్‌గా కనిపిస్తే చాలు: ఎవరైనా అమాయకుడు కొద్దిగా రిచ్‌గా కనిపిస్తే చాలు అతనివద్దకు వెళ్లి వీరే పలకరిస్తారు. ఏదైనా వాహనం ఆపితే వెళ్లి వెనకకూర్చుంటారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వాలి, లేకపోతే బూతులు తిడుతూ, అతనిపై దాడి చేస్తారు. వీరంతా ఏడు ఎనిమిది మంది గ్యాంగ్ ఉంటారు. ఒక్కరు గొడవకు దిగగానే అందరూ వచ్చి రచ్చరచ్చ చేస్తారు. బాధితుని జేబులో ఉన్న పర్సు ఖాళీ కావాల్సిందే, అతని మెడలో చైన్, బంగారు ఆభరణాలు ఉంటే అవీ లాక్కుటారు. గతంలో ఓ వ్యక్తిపై దాడిచేసి అతని వద్ద నగదు, బంగారం లాక్కుటే బాధితుని ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పంజగుట్ట కానిస్టేబుల్‌పై సెక్స్‌వర్కర్లు దాడికిదిగి బండరాయితో బలంగా కొట్టడంతో తలపగిలి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సదరు కానిస్టేబుల్‌ను యశోదా ఆస్పత్రిలో అడ్మిట్‌చేసి చికిత్స అందించారు. ఓ వ్యక్తిపై బ్లేడుతో దాడి: తాజాగా గురువారం సికింద్రాబాద్‌కు చెందిన సంతోష్ తనకారులో పనినిమిత్తం మియాపూర్ వెళ్లి తిరిగి వస్తున్నాడు. నిమ్స్ ఎదురుగా ఉన్న బస్‌స్టాప్ వద్ద వాహనం ఆపి ఓ షాప్‌లోకి వెళ్లి కొనుగోలు చేసి వచ్చాడు. అతన్ని ఓ సెక్స్‌వర్కర్ అటకాయించింది. బేరం ఆడారు కుదరకపోవడంతో అతని కారులో వెనకసీటులో కూర్చుని ఐదువేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను రెండువేలు ఇచ్చి తనవద్ద లేవు అని చెప్పడంతో అతనిపై బ్లేడుతో దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన అతడు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక్కడ బస్సు ఎక్కాలన్నా ఎంతో కష్టంగా ఉంటుంది. ఇక్కడ నిలబడే మహిళలను అందర్నీ అదే తరహాలో చూస్తూ కొంతమంది వెకిలిచేష్టలు చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ తంతు కొనసాగుతుంది. తాము ఎక్కడికైనా వెల్లాలంటే ఖైరతాబాద్‌కు వెళ్లి బస్సు ఎక్కుతాం. --- స్థానిక మహిళ జాతీయ రహదారి, నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రదేశంలో ఇలాంటి కార్యకలాపాలు సాగడం బాధాకరం. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఉంది. రోడ్డుపై వెళ్లేవారితో గొడవలు అయితే. ఇక్కడ ఉన్న రెండు మూడు వ్యభిచార ముఠాలకు నిత్యం గొడవలు ఎప్పుడూ మద్యం మత్తులో ఉండి స్థానికులకు తీవ్ర ఇబ్బందుకు కలుగచేస్తున్నారు. పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. --- ఓ స్థానిక వ్యాపారి -
'వైఎస్ఆర్ గొప్ప ప్రజా నాయకడు'
-
'మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఘనత వైఎస్‌దే'
హైదరాబాద్: పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలంగాణ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగరానికి మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి ఘనమైన ప్రాజెక్టులు సాధించిన ఘనత ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని మాజీ మంత్రి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు దానం నాగేందర్ తెలిపారు. మహానేత వైఎస్ఆర్ 66వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ జయంతి కార్యక్రమంలో మల్లు భట్టివిక్రమార్క, దానం నాగేందర్, షబ్బీర్ అలీ, కేవీపీ రామచంద్రరావు, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, భారీ సంఖ్యలో ఆయన అభిమానులు హాజరయ్యారు. -
‘మాఫీ’ జాప్యానికి మేం కారణం కాదు
- ఏపీలో రైతు రుణ మాఫీ అమలుపై ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ - అడిగిన డేటా ఇవ్వడానికి సిబ్బంది 24 గంటలు పని చేస్తున్నారు - ప్రభుత్వం తరచూ రుణమాఫీ నిబంధనలు మార్పు చేస్తోంది - దీనికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నాం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే రుణ మాఫీ పథకాన్ని అమలు చేయలేకపోతున్నామన్న ప్రభుత్వ వాదనను ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్ల సమితి కన్వీనర్, ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న సమాచారాన్ని ఇవ్వడానికి తమ సిబ్బంది 24 గంటలూ కృషిచేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణ మాఫీ నిబంధనలను తరచూ మార్పు చేస్తోందని, దీనికి తగ్గట్టుగా కొత్త డేటాను సమీకరించి ఇవ్వాల్సి వస్తోందన్నారు. అమలు చేయాలనుకుంటున్న రుణ పరిమితికి సంబంధించి తుది ఫార్మాట్‌తో వస్తే నిర్దేశిత సమయంకంటే ముందుగానే సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కొంత మంది కలెక్టర్లు అదనపు సమాచారాన్ని కూడా అడుగుతున్నారని, వీటిని ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రుణ మాఫీ అమలు ఆలస్యానికి బ్యాంకులు కారణం కాదని రాజేంద్రన్ స్పష్టం చేశారు. హైదరాబాద్, పంజాగుట్ట సర్కిల్లో ఏర్పాటు చేసిన 2,000వ ఏటీఎంను ప్రారంభించిన అనంతరం రాజేంద్రన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ రుణాల రెన్యువల్స్‌పై ప్రధానంగా దృష్టిసారించామ ని, కానీ స్పందన అంతంతమాత్రంగానే ఉందన్నారు. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా రుణాలు చెల్లించడానికి ముందుకు వస్తున్నా స్థానిక రాజకీయ నాయ కులు వారిని అడ్డుకుంటున్నారన్నారు. దీంతో గత త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో వ్యవసాయ రుణాల మొండి బకాయి(ఎన్పీఏ)లు మరో రూ. 200-300 కోట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. తొలి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్ వ్యయసాయ రుణాల్లో రూ.1,078 కోట్లు ఎన్పీఏలుగా మారడం తెలిసిందే. తెలంగాణపై అధికారిక సమాచారం లేదు తెలంగాణలో రైతు రుణమాఫీ అమలుపై ఇంత వరకు ఎటువంటి అధికారిక సమాచారం బ్యాంకులకు అందలేదని రాజేంద్రన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుల నుంచి వివిధ సమాచారాన్ని కోరుతోందన్నారు. రాజేంద్రన్ ఈ విషయం పేర్కొన్న తర్వాత తొలి దశకింద రుణ మాఫీ కోసం రూ. 4,250 కోట్లు మంజూరు చేయడానికి తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోవడం విశేషం. దీనిపై వివరణ కోసం బ్యాంకు ప్రతినిధులను సంప్రదించగా అధికారికంగా ఇంత వరకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ఏటీఎం లావాదేవీలపై పరిమితుల్లేవు: సొంత ఏటీఎం లావాదేవీల పరిమితులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రాజేంద్రన్ తెలిపారు. మిగిలిన బ్యాంకుల బాటలోనే తామూ నడుస్తామన్నారు. సొంత ఏటీఎం లావాదేవీలను నెలకు ఐదుకు పరిమితం చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆంధ్రాబ్యాంక్ 2,200 శాఖలను కలిగిఉందని.. ఈ ఏడాది కొత్తగా 450 శాఖలు.. సుమారు 500 ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.