బందోబస్తుకు వచ్చి.. లడ్డూ కౌంటర్పై దాడి | security police of president Assault laddu counter person in yadadri | Sakshi
Sakshi News home page

బందోబస్తుకు వచ్చి.. లడ్డూ కౌంటర్పై దాడి

Jul 5 2015 5:14 PM | Updated on Sep 15 2018 8:43 PM

బందోబస్తుకు వచ్చి.. లడ్డూ కౌంటర్పై దాడి - Sakshi

బందోబస్తుకు వచ్చి.. లడ్డూ కౌంటర్పై దాడి

యాదాద్రిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బందోబస్తుకు వచ్చిన పోలీసులు దౌర్జన్యం చేశారు.

నల్గొండ: యాదాద్రిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బందోబస్తుకు వచ్చిన పోలీసులు దౌర్జన్యం చేశారు. లడ్డూకౌంటర్ను పోలీసులు ధ్వంసం చేసి లడ్డూలను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు యాదాద్రి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నవిషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఘటన జరిగింది.

ఈ రోజు ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక హెలికాప్టర్లో యాదాద్రి చేరుకున్నారు. ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. యాదాద్రిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. స్వామి, అమ్మ వార్లకు రాష్ట్రపతి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవాలయంలో స్వామి వారికి స్వర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మహామండపంలో ప్రణబ్ను వేద పండితులు ఆశీర్వదించారు. ప్రణబ్ వెంట ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement