విద్యార్థినులను బంధించి పూజలు | School worker frightens students | Sakshi
Sakshi News home page

విద్యార్థినులను బంధించి పూజలు

Jun 29 2015 3:30 PM | Updated on Sep 3 2017 4:35 AM

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో పూనకంతో ఊగిపోయిన ఓ వర్కర్ విద్యార్థినులను బంధించి పూజలు చేసింది.

వరంగల్ (ఏటూరు నాగారం) : వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో పూనకంతో ఊగిపోయిన ఓ వర్కర్ విద్యార్థినులను బంధించి పూజలు చేసింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థినులను వారి తరగతి గదిలోనే బంధించి పూజలు చేసింది. దీంతో వారంతా  భయాందోళనకు గురయ్యారు.

ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై కూడా ఆమె చిర్రుబుర్రులాడింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు వచ్చి హల్‌చల్ చేసిన సదరు మహిళను మందలించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు పోలీసులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement