పథకాలు అందేలా చూడాలి | Schemes should be ensured | Sakshi
Sakshi News home page

పథకాలు అందేలా చూడాలి

Jul 3 2015 11:52 PM | Updated on Sep 3 2017 4:49 AM

ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలకు వచ్చే మహిళలకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని ఆల్‌ఇండియా హెల్త్ కన్సల్టెంట్ మనోరమదీక్షిత్ సూచించారు.

నవాబుపేట : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలకు వచ్చే మహిళలకు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వారి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని ఆల్‌ఇండియా హెల్త్ కన్సల్టెంట్ మనోరమదీక్షిత్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను అందరికీ అందేలా చూడాలన్నారు. శుక్రవారం నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), కొల్లూరు సబ్‌సెంటర్‌ను ఢిల్లీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు చెల్లించే  వెయ్యి, సహాయకులకు అందించే రవాణా చార్జీలపై ఆరా తీశారు. మహిళా, శిశువుల కోసం ప్రత్యేకంగా ఉన్న వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు.
 
 
 24 గంటల ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారా? లేదా? ఖాళీగా ఉన్న పోస్టులు, ఫార్మసీ విభాగంలో మందులు తదితర వాటిపై విచారణ జరిపారు. ఇక్కడి ఆపరేషన్ థియేటర్ త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా. జావీద్, వైద్య సిబ్బంది రాఘవేందర్, సుధాకర్, శ్రీను  పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement