మార్చి 9న సత్యం కేసు తీర్పు | Satyam case verdict on March 9 | Sakshi
Sakshi News home page

మార్చి 9న సత్యం కేసు తీర్పు

Dec 24 2014 6:53 AM | Updated on Sep 15 2018 3:51 PM

అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రత్యేకకోర్టు తీర్పును వాయిదా వేసింది.

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రత్యేకకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే మార్చి 9న తీర్పును వెలువరించనున్నట్టు ప్రత్యేకన్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి మంగళవారం ప్రకటించారు. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు రామలింగరాజు సహా ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement