11నుంచి సాండ్‌ టాక్సీ విధానం

sand taxi will be be implemented in nalgonda says collector gaurav uppal - Sakshi

కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌

పోలీస్, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

నల్లగొండ : ఈ నెల 11 నుంచి సాండ్‌ టాక్సీ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్‌ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాండ్‌ టాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి మండలంలో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు విధిగా సాండ్‌ టాక్సీ కింద నమోదు చేసుకోవాలని సూచించారు.

సాండ్‌ టాక్సీ కింద నమోదు చేయించుకునే యజమానులు రూ.15 వేలు డీడీనీ సాండ్‌ మేనేజ్‌మెంట్‌ సొసైటీ పేరున, రూ.10 వేల జీపీఎస్‌ సర్వీస్‌ ఏర్పాటు చేసేం దుకు.. వెర్తోనిక్‌ ఐటీ సొల్యూషన్‌ పేరున చెల్లించి తహసీల్దార్‌ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని సూచించారు. సాండ్‌ టాక్సీలో నమోదు చేయించుకున్న ట్రాక్టర్లుకు ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.55లు చొప్పున చెల్లిస్తామని తెలిపారు. జిల్లాలోని నల్లగొండ మండలం నర్సింగ్‌భట్ల, మిర్యాలగూడెం మండలం తక్కెళ్లపాడు, మునుగోడు మండలం కొరటికల్, దేవరకొండ మండలం ముదిగొండ, శాలిగౌరారం మండలం చిత్తలూరు, కనగల్‌ మండలం ఎస్‌. లింగోటం, బొమ్మేపల్లి, అనుమల మండలం పు లిమామిడి, వేములపల్లి మండలం సల్కునూర్, నాంపల్లి మండలం టీపీ గౌరారం గ్రామాల్లో ఇసుక రీచ్‌లను గుర్తించామన్నారు. ఇసుక అవసరం ఉన్నవారు మీసేవ, ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకో వాలని సూచించారు. సాండ్‌ టాక్సీ ద్వారా ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో జేసీ నా రాయణరెడ్డి, డీఆర్వో ఖీమ్యానాయక్, పీఆర్‌ ఎస్‌ఈ భాస్కర్‌రావు, ఐబీ ఎస్‌ఈ హమీద్‌ ఖాన్, జేడీఏ నర్సిం గరావు, మైన్స్‌ ఏడీ సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top