'ఆ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలి' | sampath kumar challeges etala rajender | Sakshi
Sakshi News home page

'ఆ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలి'

Sep 16 2017 7:40 PM | Updated on Mar 25 2019 3:09 PM

'ఆ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలి' - Sakshi

'ఆ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలి'

ఆత్మాభిమానం ఉన్న దళిత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలని..

సాక్షి, హైదరాబాద్‌: దళితుల సంక్షేమంపై మంత్రి ఈటెల రాజేందర్‌ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ సర్కార్ దళిత వ్యతిరేకి అని ఆయన విమర్శించారు. దళితుల సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించాల్సిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.

ఆత్మాభిమానం ఉన్న దళిత ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. దళిత సీఎం పేరుతో మొదలైన కేసీఆర్ మోసం ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దళితులకు మొండిచేయి చూపారని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement