అభినందన్‌కు నా సెల్యూట్‌: కేటీఆర్‌ | Salute To UItra Dignified Braveheart Abhinandhan, Tweets KTR | Sakshi
Sakshi News home page

అభినందన్‌.. అందుకో నా సెల్యూట్‌: కేటీఆర్‌

Feb 28 2019 12:18 PM | Updated on Feb 28 2019 2:05 PM

Salute To UItra Dignified Braveheart Abhinandhan, Tweets KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్థాన్‌ సైన్యానికి బందీగా చిక్కిన భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఒకవైపు ‘దేశంలో స్వార్థ రాజకీయాలు, టీఆర్పీ రేటింగ్స్‌లో మీడియాలో యుద్ధాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన ఇండియన్‌ పైలట్‌ అభినందన్‌ ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉంటూ.. దేశ రహస్యాలు వెల్లడించేందుకు నిరాకరించారు. విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప ధైర్యసాహసాలను, హుందాతనాన్ని ప్రదర్శించిన అభినందన్‌కు నా సెల్యూట్‌’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అభినందన్‌ నా హీరో.. అతన్ని స్వదేశం తీసుకురండి అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు జోడించారు. 

చదవండి: తండ్రి సహకారం అందించిన చిత్రంలో మాదిరిగానే..

Advertisement
 
Advertisement
Advertisement