సాక్షి ఇండియా జియో బీ | Sakshi Geo Bee-2014 Competition registrations date extended to Dec 31 | Sakshi
Sakshi News home page

సాక్షి ఇండియా జియో బీ

Dec 24 2014 2:27 AM | Updated on Aug 20 2018 8:38 PM

సాక్షి ఇండియా జియో బీ - Sakshi

సాక్షి ఇండియా జియో బీ

జాగ్రఫీలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇండియా స్పెల్ బీ భాగస్వామ్యంతో ‘సాక్షి ఇండియా జియో బీ-2014’ పేరిట ప్రత్యేక పోటీని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

రిజిస్ట్రేషన్ గడువు 31దాకా పొడిగింపు
 సాక్షి, హైదరాబాద్: జాగ్రఫీలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఇండియా స్పెల్ బీ భాగస్వామ్యంతో ‘సాక్షి ఇండియా జియో బీ-2014’ పేరిట ప్రత్యేక పోటీని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకునే గడువును ఈ నెల 31వరకు పొడిగించినట్లు సాక్షి మీడియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో 7, 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు.
 
  పోటీలో భాగంగా ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ, రీజినల్ జాగ్రఫీ, క్లైమటాలజీ, కోస్టల్ జాగ్రఫీ, హిస్టారికల్ అండ్ టైమ్ జాగ్రఫీ వంటి అనేక అంశాలపై ప్రశ్నలుంటాయి. ఈ పోటీ వల్ల విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్‌తోపాటు ప్రకృతి పట్ల ప్రేమ కూడా పెరుగుతుందని రాణిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి పోటీ నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. జియో బీ పోటీని మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష జనవరి 4న, ప్రీ ఫైనల్స్ జనవరి 10న, ఫైనల్స్ జనవరి 23న జరుగుతాయి. విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు సర్టిఫికెట్లు అందజేస్తారు. రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. చివరి తేదీ ఈ నెల 31. రిజిస్ట్రేషన్ రుసుము రూ.100. పోటీలో పాల్గొనదలచిన వారు మరిన్ని వివరాల కోసం 9505551099, 9705199924 నంబర్లలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్పాన్సర్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement