ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు

Sabhas Are Held In Khammam - Sakshi

16 నుంచి 18 వరకు ఎఫ్‌ఎన్‌పీవో, ఎన్‌యూపీఈ మహాసభల నిర్వహణ

ప్రత్యేక కమిటీ ఏర్పాటు 

ఖమ్మంవ్యవసాయం: నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ గ్రూప్‌–సీ(ఎఫ్‌ఎన్‌పీఓ), నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ గ్రామీణ డాక్‌ సేవక్స్‌ (ఎన్‌యూపీఈ) రెందో ద్వై వార్షిక మహాసభలను ఖమ్మంలో నిర్వహిచడానికి ఆయా యూనియన్ల తెలంగాణ సర్కిల్‌ యూనియన్లు నిర్ణయించాయి. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఖమ్మం నగరంలోని స్టేషన్‌ రోడ్‌లో ఉన్న శాంతి హోటల్‌ వేదికగా నిర్వహించడానికి నిర్ణయించారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు సంయుక్త ఓపెన్‌ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించా రు. ఈ మహాసభల్లో ఎన్‌యూజీడీఎస్, ఎఐజీడీఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ డిమాండ్లపై ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు 16రోజుల పాటు చారిత్రక సమ్మె అనంతరం జరిగిన పరిస్థితులు, డిపార్ట్‌మెంట్‌ ఒప్పుకున్న హామీలు అమలు, పెం డింగ్‌ అంశాలపై కూడా చర్చ జరుగుతుంది.

డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు, జీడీఎస్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక రకాల సాంకేతిక ఇబ్బందులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి వాటి సాధనకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చ ఉంటుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ బి.చంద్రశేఖర్, గౌరవ అతిథులుగా హైదరాబాద్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఆకాష్‌దీప్‌ చక్రవర్తి, పోస్టల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్లు వీవీ సత్యనారాయణరెడ్డి, ఎస్‌వీరావుల ను ఆహ్వానించారు. కార్యక్రమ నిర్వహణకు రిసెప్షన్‌ కమిటీగా జి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిసీహెచ్‌ కోటేశ్వరరావు, కోశాధ్యక్షుడిగా సీహెచ్‌ఎస్‌బీవీబీకుమార్‌ను నియమించారు. ఎఫ్‌ ఎన్‌పీఓ ఖమ్మం డివిజన్‌ గ్రూప్‌–సీ అధ్యక్షుడు పమ్మి వెంకటేశ్వరరావు కార్యక్రమ నిర్వహణలో భాగంగా వివిధ బ్రాంచ్‌ల అధ్యక్ష, కార్యదర్శుల తో సమావేశాలు నిర్వహిస్తూ, కార్యక్రమ విజయవంతానికి ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌లోని శాఖల అన్ని కార్యాలయాలకు కార్యక్రమ వివరాలను వివిధ రకాలుగా యూనియన్‌ నాయకులు చేరవేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top