మత్స్యకారుల సంక్షేమానికి రూ.12కోట్లు | Rs 12 crores for the fishermens welfare | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సంక్షేమానికి రూ.12కోట్లు

Jul 28 2018 2:44 PM | Updated on Mar 21 2019 7:27 PM

Rs 12 crores for the fishermens welfare - Sakshi

లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

సిరిసిల్ల: జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా రూ.12 కోట్లు కేటాయించామని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తెలిపారు. స్థానిక పొదుపు భవన్‌లో శుక్రవారం వివిధ కేటగిరీల్లో లబ్ధిదారులను డ్రా పద్ధతిన కలెక్టర్‌ ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులను డ్రా పద్ధతిన కలెక్టర్‌ సమక్షంలో ఎంపిక చేశారు.

ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మత్స్యకార్మికులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. 47 సంఘాలకు చెందిన 133 మంది అభ్యర్థులు వివిధ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకోగా 57 మందిని ఎంపిక చేశారు. చేపల రవాణాకు సంబంధించి 12 మంది దరఖాస్తు చేసుకోగా 11 మందిని ఎంపిక చేశారు.

చేపలు పట్టే సామగ్రి, ద్విచక్రవాహనాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి బి.అంజయ్య, పశుసంవర్థక శాఖ అధికారి రమణమూర్తి, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు పోలు లక్ష్మణ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement