విద్యార్థులకు ప్రభుత్వం షాక్‌ | Govt announced that it would not be able to provide educational kits | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ప్రభుత్వం షాక్‌

May 23 2026 5:09 PM | Updated on May 23 2026 5:35 PM

Govt announced that it would not be able to provide educational kits

సాక్షి, అమరావతి:  కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పిడుగులాంటి వార్త చెప్పింది. విద్యా కానుక కింద విద్యార్థులకందించే యూనిఫాం, షూ, బ్యాగ్‌ ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ మేరకు జూన్ 12 వ తేదీన అందించే విద్యాకానుక కిట్‌ను అందించలేమని సమగ్రశిక్ష డైరెక్టర్‌ ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలోనూ గ్యారంటీ లేదని ప్రకటించారు. 

ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక భారంతో యూనిఫాం, బ్యాగు, బట్టలు ఇవ్వలేమని తెలిపింది. ఈ పిడుగులాంటి వార్తతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ హాయాంలో పాఠశాలలు తెరిచే రోజే విద్యా కానుక కిట్‌ను అందజేసేవారని ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేసి తమ చదువులకు ఆటంకం కలగజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతుంది. గత రెండేళ్లుగా నాడు-నేడు పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమైన విద్యార్థుల చదువు విషయంలోనూ కూటమి ప్రభుత్వం కోతలు పెడుతుండడంతో  సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement