రూ.కోటి విలువ చేసే కిలో మత్తుమందు స్వాధీనం | Rs 1 crore of worth Killo drug seized by NCB officers | Sakshi
Sakshi News home page

రూ.కోటి విలువ చేసే కిలో మత్తుమందు స్వాధీనం

May 25 2015 11:02 PM | Updated on Oct 22 2018 1:59 PM

నగరంలో డ్రగ్ స్మగ్లర్ల గుట్టు రట్టయింది.

ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసిన ఎన్‌సీబీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్ స్మగ్లర్ల గుట్టు రట్టయింది. అంతర్జాతీయ డ్రగ్ ముఠాల ద్వారా పాకిస్థాన్ నుంచి హైదరాబాద్‌కు చేరిన హెరాయిన్ మత్తు మందు సోమవారం ఎల్‌బీ నగర్ ప్రాంతంలో స్థానిక స్మగ్లర్ల చేతులు మారుతుడంగా ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు మెరుపు దాడి జరిపి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.కోటి విలువ చేసే హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు సత్యనారాయణ, యేసు రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఎన్‌సీబీ వర్గాల ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్ స్మగ్లింగ్ ముఠాలు పాకిస్థాన్ నుంచి రాజస్థాన్,హైదరాబాద్ మీదుగా దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకు హెరాయిన్‌ను తరలిస్తుండా పక్కా సమాచారంతో దాడులు జరిపి పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement