రౌడీ షీటర్ దారుణ హత్య | roudysheeter murdered in nallagonda distirict | Sakshi
Sakshi News home page

రౌడీ షీటర్ దారుణ హత్య

Feb 26 2015 12:28 PM | Updated on Oct 16 2018 8:46 PM

నల్లగొండ జిల్లాకు చెందిన రౌడీషీటర్ యూసుఫ్ దారుణ హత్యకు గురయ్యాడు.

నల్లగొండ: నల్లగొండ జిల్లాకు చెందిన రౌడీషీటర్ యూసుఫ్ దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు యూసఫ్‌ను గొడ్డళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.  హైదరాబాద్, నల్లగొండ,రంగారెడ్డి జిల్లాల పరిధిలో భూ తగాదాలతో పాటు, 12 హత్యలు సహా దాదాపు 100 కేసుల్లో ఇతడు నిందితుడు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement