రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ | Robbery in Metpally | Sakshi
Sakshi News home page

రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ

Dec 1 2015 5:34 PM | Updated on Aug 30 2018 5:27 PM

కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి రమేష్‌ రాజు ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది.

మెట్‌పల్లి (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి రమేష్‌ రాజు ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఊరి నుంచి మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రమేష్‌రాజు చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 40 తులాల వెండి, 6 తులాల బంగారు నగలు, ల్యాప్‌టాప్, టీవీ తదితర వస్తువులను తీసుకెళ్లారు. చోరీ జరిగిన ఇంటిని మెట్‌పల్లి ఎస్‌ఐ రాజేష్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement