పెళ్లికి వెళ్తే ఇళ్లు దోచేచారు... | robbery in a house | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్తే ఇళ్లు దోచేచారు...

Feb 27 2015 4:42 PM | Updated on Sep 2 2017 10:01 PM

జైపుర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన శీలం కిష్టయ్య ఇంట్లో గురువారం చోరీ జరిగింది.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపుర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన శీలం కిష్టయ్య ఇంట్లో గురువారం చోరీ జరిగింది. వివరాలు...బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ. లక్ష నగదు, రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీరాంపూర్ సీఐ కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు.

(జైపుర్)

Advertisement
 
Advertisement
Advertisement