టిప్పర్ ఢీ : వ్యక్తి మృతి | road accident in karimnagar distirict | Sakshi
Sakshi News home page

టిప్పర్ ఢీ : వ్యక్తి మృతి

Mar 3 2015 7:50 PM | Updated on Aug 30 2018 3:56 PM

బొగ్గులోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బైక్‌ను ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

కరీంనగర్ : బొగ్గులోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బైక్‌ను ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని 5వ బొగ్గుగని సమీపంలో మంగళవారం జరిగింది. వివరాలు..కమాన్‌పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బైరీ మల్లేష్(32) గోదావరిఖనిలోని జీఎమ్ కాలనీలో నివాసముంటున్నాడు.

మంగళవారం బైక్‌పై గోదావరిఖని వస్తుండగా మూల మలుపు వద్ద టిప్పర్ ఢీ కొనడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(గోదావరిఖని)

Advertisement
 
Advertisement
Advertisement