అయ్యో..పాపం! | Road accident | Sakshi
Sakshi News home page

అయ్యో..పాపం!

May 27 2015 2:13 AM | Updated on Aug 30 2018 3:58 PM

అయ్యో..పాపం! - Sakshi

అయ్యో..పాపం!

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మోకాలు వరకు తెగిపోయిన హృదయవిదారక ఘటన కోరుట్ల మండలం మోహన్‌రావు పేట గ్రామ...

రోడ్డు ప్రమాదంలో తెగిపడ్డకాలు

 కోరుట్ల : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మోకాలు వరకు తెగిపోయిన హృదయవిదారక ఘటన కోరుట్ల మండలం మోహన్‌రావు పేట గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన వెంకట్‌రెడ్డి(35) జగిత్యాల నుంచి కోరుట్ల వైపు మోటార్‌సైకిల్‌పై వస్తుండగా మోహన్‌రావుపేట క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటరెడ్డి కుడి కాలు మోకాలు వరకు తెగిపోయి రోడ్డుపై పడిపోయింది.

సంఘటన స్థలంలో కొద్ది సేపటికి సృ్పహా కోల్పోయిన వెంకటరెడ్డిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement