breaking news
bus colliding
-
అయ్యో..పాపం!
రోడ్డు ప్రమాదంలో తెగిపడ్డకాలు కోరుట్ల : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మోకాలు వరకు తెగిపోయిన హృదయవిదారక ఘటన కోరుట్ల మండలం మోహన్‌రావు పేట గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన వెంకట్‌రెడ్డి(35) జగిత్యాల నుంచి కోరుట్ల వైపు మోటార్‌సైకిల్‌పై వస్తుండగా మోహన్‌రావుపేట క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్న మెట్పల్లి డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకటరెడ్డి కుడి కాలు మోకాలు వరకు తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. సంఘటన స్థలంలో కొద్ది సేపటికి సృ్పహా కోల్పోయిన వెంకటరెడ్డిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
తణుకు క్రైం, న్యూస్‌లైన్ :తణుకు మండలం తేతలి వై జంక్షన్‌వద్ద బుధవారం మోపెడ్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. వివరాలు ఇవి.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పెదగొల్లపాలానికి చెందిన కొప్పిశెట్టి మహాలక్ష్మి, అతని భార్య సత్యవతి(45) కొయ్యలగూడెంలోని తమ కుమార్తె ఇంటికి మోపెడ్‌పై బయలుదేరారు. తేతలి వై జంక్షన్ వద్దకు వచ్చేసరికి తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు మోపెడ్ ను ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టగానే వెనుక కూర్చున్న సత్యవతి బస్సువైపుకు పడిపోవడంతో వెనుక చక్రం తల మీద నుంచి వెళ్లిపోయింది. ఆమె బండిపైనే ఉండిపోగా తల చిధ్రమైపోయింది. ఘటన చూసిన మహాలక్ష్మి భయంతో గజగజ వణికి సొమ్మసిల్లిపోయాడు. పోలీసులు 108 అంబులెన్స్‌లో అతడిని తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. రూరల్ ఎస్సై ఎం.కేశవరావు ఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లేందుకు.. పెద్ద తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వెళ్తుం డగా ఇలా జరిగిందేంటి అని మహాలక్ష్మి చేస్తున్న రోదన అక్కడి వారిని కలచివేసింది. కొయ్యలగూడెంలోని తమ కుమార్తె ఇంటికి వెళ్లి అంతా కలిసి పెద్ద తిరుపతి వెళ్దామని బయలుదేరామని ఇంతలో ఇలా జరిగిపోయిందంటూ గండెలవిసేలా రోదించాడు.