ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో ప్రమాదం | risk in ntpc rama gundam | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో ప్రమాదం

Jun 12 2015 8:10 PM | Updated on Sep 3 2017 3:38 AM

బూడిద నీరు పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లాలోని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో శుక్రవారం చోటుచేసుకుంది.

కరీంనగర్: బూడిద నీరు పడి వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లాలోని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో శుక్రవారం చోటుచేసుకుంది. 500 మెగావాట్ల ఏడో యూనిట్ లో విధులు నిర్వర్తిస్తున్న మోగ్లీ (42) యాష్ పైప్‌లైన్ సరిచేస్తుండగా వేడిగా ఉన్న బూడిద నీరు అతని పై పడింది. దీంతో వీపు పూర్తిగా కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన సహచరులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అతణ్ని హైదరాబాద్ తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement