యూత్‌ఫుల్‌ ‘రిస్క్‌’.. ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ | Risk Movie Trailer Event Highlights | Sakshi
Sakshi News home page

యూత్‌ఫుల్‌ ‘రిస్క్‌’.. ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ

May 31 2026 12:13 PM | Updated on May 31 2026 12:15 PM

Risk Movie Trailer Event Highlights

‘సంపంగి, 6 టీన్స్‌’ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్‌ అందించిన ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘రిస్క్‌’. సందీప్‌ అశ్వ, సన్యా ఠాకూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహించి, సంగీతం అందించడంతో పాటు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ రెండో వారంలో విడుదల కానుంది. 

ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని నిర్ణయించుకున్నాను. యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది’’ అన్నారు. ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మ్యూజికల్‌గానూ మా మూవీ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది’’ అని చెప్పారు. ‘‘మ్యూజిక్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ ఇక్కడివరకు వచ్చాను. ‘రిస్క్‌’ తప్పకుండా మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది’’ అని సందీప్‌ అశ్వ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement