ఢిల్లీ చేరుకున్న రాజీవ్‌జ్యోతి సద్భావన యాత్ర

Rajiv Jyothi sadbhavana yatra arrived in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఉగ్రవాదానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న రాజీవ్‌ జ్యోతి సద్భావన యాత్ర ఢిల్లీ చేరుకుంది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చెన్నైలోని పెరంబుదూర్‌ నుంచి ఆగస్టు 9న చేపట్టిన ఈ యాత్రలో పలు రాష్ట్రాల పీసీసీ నేతలు పాల్గొన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వారికి ఆహ్వానం పలికి జ్యోతి అందుకున్నారు. యాత్రలో పాల్గొన్న నేతలు పార్లమెంటు వద్ద ఉన్న రాజీవ్‌ విగ్రహానికి నివాళులర్పించి పాలాభి షేకం చేశారు. సోమవారం రాజీవ్‌ జయంతి సందర్భంగా సద్భావన యాత్ర జ్యోతిని వీర్‌భూమి వద్ద ఉంచుతామని చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top