ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి.
బేల: ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు స్తంభించాయి. జిల్లాలో కురుస్తన్న వర్షాలతో పాటు, ఎగుమ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో జనజీవనం స్తంభించింది. జైనథ్ మండలం బెలగామ సమీపంలోని తాత్కాలిక వంతెన ఎగువ నుంచి వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. దీంతో గురువారం ఉదయం నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.