బీసీ రిజర్వేషన్లను పెంచాలి: కృష్ణయ్య | R krishnaiah letter to kcr | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లను పెంచాలి: కృష్ణయ్య

Jun 11 2018 1:30 AM | Updated on Aug 15 2018 9:10 PM

R krishnaiah letter to kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 54 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 54 శాతమని స్పష్టమైందని, జనాభా ప్రాతిపదికన ఆమేరకు రిజర్వేషన్లను పెంచాలని కోరారు.

రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఇలాంటి కుట్రలు సాగవని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పష్టం చేసినందున ఆమేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement