కేటీఆర్‌ను కలిసిన నటుడు ప్రకాశ్‌రాజ్‌ | Prakash Raj meets KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ను కలిసిన నటుడు ప్రకాశ్‌రాజ్‌

Jan 3 2019 3:03 AM | Updated on Jan 3 2019 3:04 AM

Prakash Raj meets KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ గెలుపు నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశ్‌రాజ్, నూతన సంవత్సర గ్రీటింగ్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశ విషయమై కేటీఆర్‌తో చర్చించారు. అనంతరం కేటీఆర్‌తో భేటీ ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన ఆయన, తన రాజకీయ ప్రవేశానికి కేటీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తి దాయక మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement