పొన్నాల, ఉత్తమ్ రాజీనామా చేయాలి | Ponnala, Uttam must resign | Sakshi
Sakshi News home page

పొన్నాల, ఉత్తమ్ రాజీనామా చేయాలి

May 19 2014 2:22 AM | Updated on Mar 18 2019 9:02 PM

పొన్నాల, ఉత్తమ్ రాజీనామా చేయాలి - Sakshi

పొన్నాల, ఉత్తమ్ రాజీనామా చేయాలి

తిప్పర్తి : కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ టీ-పీసీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్

 తిప్పర్తి : కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ టీ-పీసీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో టీ-పీసీసీ వైఫల్యం చెందిందని విమర్శించారు.

దీనివల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కనపెట్టి అనామకులకు టీపీసీసీ పగ్గాలు ఇచ్చారని.. దీంతో వారు ఎన్నికల్లో తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతను అందరి ఎమ్మెల్యేల అంగీకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement