'కేసీఆర్ వ్యవహరం నేతి బీరకాయ చందం' | Ponnala Lakshmaiah takes on TRS Chief Kalvakuntla Chandrashekar Rao | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ వ్యవహరం నేతి బీరకాయ చందం'

Apr 16 2014 2:25 PM | Updated on Aug 14 2018 5:54 PM

'కేసీఆర్ వ్యవహరం నేతి బీరకాయ చందం' - Sakshi

'కేసీఆర్ వ్యవహరం నేతి బీరకాయ చందం'

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో బుధవారం కరీంనగర్లో విమర్శనాస్త్రాలు సంధించారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనదైన శైలిలో బుధవారం కరీంనగర్లో విమర్శనాస్త్రాలు సంధించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రోజుకో సిద్ధాంతాలు పేరుతో... పూటకో మాట మాట్లాడతారని ఆరోపించారు. అలాంటి వారి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని కేసీఆర్ని విమర్శించారు.

 

నేతి బీరకాయలో నెయ్యి ఎంతో ఉంటుందో కేసీఆర్ మాటల్లో నిజం కూడా అంతే ఉంటుందంటూ కేసీఆర్ను ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులతో పొత్తు పెట్టుకునేందుకు టీఆర్ఎస్ తహతహలాడుతుందని... అలాంటి పార్టీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. కరీంనగర్ లో ఈ రోజు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆ సభకు ఇప్పటికే భారీగా ప్రజలు తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement