‘ప్రమాదాల నివారణలో ప్రభుత్వ వైఫల్యం’  | Ponguleti Sudhakar Reddy On Palamuru Tunnel Accident | Sakshi
Sakshi News home page

‘ప్రమాదాల నివారణలో ప్రభుత్వ వైఫల్యం’ 

Published Fri, May 25 2018 3:52 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

Ponguleti Sudhakar Reddy On Palamuru Tunnel Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల్లో ప్రమాదాలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. కార్మిక, హోం, ఇమిగ్రేషన్‌ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లడంలో, అధికారులను సమన్వయం చేయడంలో ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గురువారం సీఎల్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగం పనుల్లో బ్లాస్టింగ్‌ జరిగిన సందర్భంగా ఇద్దరు కూలీలు మృతిచెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement