వసూళ్లపై పోలీస్‌ అధికారుల ఆరా..? 

Police Officers Checks on Illegal Charges - Sakshi

కోల్‌ ట్రాన్స్‌పోర్టులో మళ్లీ దందా..!

సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోని 5 ఇంక్‌లైన్‌ వద్దగల కోల్‌ ట్రాన్స్‌పోర్టులో మళ్లీ వసూళ్ల దంద మొదలైంది. ఈవిషయంపై జిల్లా ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందితో ఆరా తీయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఈ వ్యవహారంపై కొత్తగూడెం ఏరియా సీనియర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వి శ్రీనివాస్‌రావు లారీ ఓనర్స్, ట్రాన్స్‌పోర్టర్లతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వసూళ్లను నిలిపివేయాలని హెచ్చరించారు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో ముందస్తు జాగ్రత మేరకు ఏరియాలో కోల్‌ ట్రాన్స్‌పోర్టుకు అంతరాయం వాటిల్లకుండా ఉండేందుకు పోలీస్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

ఈ మేరకు డివిజన్‌ ఉన్నతాధికారి ఈవసూళ్లపై సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. కోల్‌ట్రాన్స్‌పోర్టులో గతంలో ఒక వర్గం వారే వసూళ్లు చేస్తే, ఈసారి రెండు వర్గాల వారు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి యాజమాన్యం నుంచి వినియోగదారులు బొగ్గును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, ట్రాన్స్‌పోర్టర్ల ద్వారా రవాణా చేయించుకుంటుంటే... ఈ మధ్యలో ఈ వసూళ్ల దందా ఏంటని, దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని స్థానిక పోలీసులను కోరినట్లు తెలిసింది.      

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top