తొలి విడత 84,370 మంది అర్హులు

PM Kisan Samman Nidhi Yojna Start - Sakshi

సాగుకు పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం అందజేయనున్న ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం–కిసాన్‌)కి ఎంపికైన అర్హుల సంఖ్య దాదాపు కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 84,370 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్న ఒకే పట్టాదారులు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఐదెకరాల్లోపు భూమి ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. తెల్లరేషన్, ఆధార్‌ కార్డులు ఆధారంగా నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) అందజేసిన జాబితాను జిల్లా వ్యవసాయ శాఖ వడపోసింది. తొలుత 530 గ్రామాల్లో ఐదెకరాల్లోపు భూమి ఉన్న 1.04 లక్షల మంది వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందాయి.

దీని ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనల మేరకు అర్హతలు ఉన్నాయా.. లేవా అనేది నిర్ధారించారు. ఇందులో  84,370 మంది రైతులను అర్హులను గుర్తించారు. వీరు తొలి విడత రూ.2 వేల సాయం పొంద నున్నారు. మరో 12 గ్రామాల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈనెల 28లోపు తొలి విడత అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.  –సాక్షి, రంగారెడ్డి జిల్లాసాగుకు పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం అందజేయనున్న ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం–కిసాన్‌)కి ఎంపికైన అర్హుల సంఖ్య దాదాపు కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 84,370 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్న ఒకే పట్టాదారులు.

దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఐదెకరాల్లోపు భూమి ఉన్న కుటుంబాలకు ఏడాదికి రూ.6 వేలు అందజేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. తెల్లరేషన్, ఆధార్‌ కార్డులు ఆధారంగా నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) అందజేసిన జాబితాను జిల్లా వ్యవసాయ శాఖ వడపోసింది. తొలుత 530 గ్రామాల్లో ఐదెకరాల్లోపు భూమి ఉన్న 1.04 లక్షల మంది వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందాయి. దీని ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనల మేరకు అర్హతలు ఉన్నాయా.. లేవా అనేది నిర్ధారించారు. ఇందులో  84,370 మంది రైతులను అర్హులను గుర్తించారు. వీరు తొలి విడత రూ.2 వేల సాయం పొంద నున్నారు. మరో 12 గ్రామాల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈనెల 28లోపు తొలి విడత అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది.

రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో ఎలాంటి సంబంధం లేకుండా పీఎం–కిసాన్‌ను అమలు చేస్తున్నారు. నిజమైన అర్హులను తేల్చేందుకు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ట్రెజరీ ద్వారా వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబంలోని సభ్యులు ఎవరనేది తెలుసుకునేందుకు పౌర సరఫరాల శాఖ, భూముల వివరాల కోసం రెవెన్యూ శాఖ నుంచి సేకరించిన వివరాలను పరిశీలిస్తున్నారు. వీటికి ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించి కుటుంబం యూనిట్‌గా అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నిబంధనలకు లోబడి ఉన్న వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో ముగియనుంది.

రెండో విడతలో బహుళ పట్టాదారులు
 
ఐదెకరాల లోపు భూమి ఉన్న సింగిల్‌  పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పట్టాదారుడే అర్హుడని తొలి విడత కింద గుర్తిస్తున్నారు. రెండో విడతలో ఇందుకు భిన్నంగా ఉండనుంది. బహుళ పట్టాదారుల లెక్క తేల్చి అందులోనూ అర్హులను తేల్చే ప్రక్రియను త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. అంటే కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నా వారందరి పేరిట కలిపి ఐదెకరాల లోపు భూమి ఉంటే.. ఆ కుటుంబం అర్హత సాధించినట్లే. తల్లిదండ్రుల పేరిట ఐదు ఎకరాలు ఉండి.. 18 ఏళ్ల వయసు పైబడి ఉన్న కుమారుడి పేరిట ఇంకొంచెం భూమి కలిగి ఉన్నా అర్హులుగా గుర్తించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆ వ్యక్తిని ప్రత్యేక కుటుంబంగా పరిగణించే వీలుందని వివరిస్తున్నారు. 

నిధులు విడుదల..

పీఎం–కిసాన్‌ పథకాన్ని అధికారికంగా ఆదివారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొంతమందికి తొలుత ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని వ్యవసాయశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇందుకోసం కొంత బడ్జెట్‌ విడుదలైందని సమాచారం. మొత్తం మీద అర్హుల ఖాతాల్లో డబ్బుల జమ ప్రక్రియ మూడునాలుగు రోజుల్లో పట్టాలెక్కనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top