భారీగా రేషన్ బియ్యం పట్టివేత | pds rice seized in yellandu bypass road in khammam district | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Jun 8 2016 12:35 PM | Updated on Sep 4 2017 2:00 AM

ఖమ్మం జిల్లా ఇల్లందు బైపాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడు లారీల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లందు బైపాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న మూడు లారీల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యంతోపాటు లారీలను సీజ్ చేశారు. లారీడ్రైవర్లలను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డోర్నకల్లు నుంచి రెండు లారీలు, నల్గొండ నుంచి ఓ లారీలో సుమారు 550 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

ఈ మొత్తం బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు తమకు ముందుస్తు సమాచారం అందిందని...ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement